మాటూరు పేట బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు

Published: Tuesday April 11, 2023
మధిర ,ఏప్రిల్ 10 ప్రజా పాలన ప్రతినిధి: మాటూరు పేట టిఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో సోమవారం నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని,గతంలో స్మశానవాటీకలు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారనీ,దేశవ్యాప్తంగా తెలంగాణలో పట్టణాలు, గ్రామాలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందనీ,
దేశంలోనే అత్యంత గొప్ప పథకం కళ్యాణ లక్ష్మి ,కెసిఆర్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పథకాలు పార్లమెంట్లో చెప్పినప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యపోయారు.తెలంగాణ రాకముందు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. విద్యుత్ సక్రమంగా లేదు, తాగునీరు, సాగునీరు, లేక తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.ప్రభుత్వ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ధారధాత్వం చేస్తుంది.
కార్యకర్తల కష్టపడి పనిచేయడం వల్ల మా అందరికి పదవులు వచ్చాయి. రాష్ట్రంలో మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది ఐదారు నెలల్లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మధిర లో బి ఆర్ యస్ అభ్యర్థిని గెలిపించాలనీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, ఉచిత విద్యుత్తు అందించడం జరిగింది.జిల్లాలో పదికి పది బిఆర్ఎస్ ను గెలిపించుకుందాం
 కార్యకర్తలు కష్టపడి పనిచేసి మధిరలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలనీ కోరారు.