ఈనెల 20న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్

Published: Monday December 20, 2021
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 18 (ప్రజాపాలన) : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో ఇంటర్ బోర్డ్ వైఖరిని నిరసిస్తూ ఈనెల 20న ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి తెలిపారు. ఆదివారం పట్టణములోని ఎస్సీ హాస్టల్ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఇంటర్ బోర్డు వ్యవహరించిన వైఖరి మూలంగా 8 మంది విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని, 4 విద్యార్థులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 2 సంవత్సరాల కరోనా సమయంలో పాఠాలు బోధించే కుండా పరీక్షలు పెట్టిన ఇంటర్ బోర్డుపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థుల ను ఉచిత రివల్యూషన్ నిర్వహించి మినిమం మార్కులతో పాస్ అయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. మరణించిన నలుగురు విద్యార్థులకు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించ్చి, ఒకరికి ఉద్యోగ ఇవ్వాలన్నారు. ఈ బందులో జిల్లాలోని ఇంటర్మీడియట్ ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా కమిటీ సభ్యులు ప్రదీప్, నాయకులు ప్రశాంత్, సాయి, సుధాకర్, భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.