దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది

Published: Friday February 17, 2023
* వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ బ్యూరో 16 ఫిబ్రవరి ప్రజాపాలన : దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలోని శ్రీ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల ఆశీస్సులు పొందారు. శ్రీ హనుమాన్ మందిర నిర్మాణానికి మతాలకతీతంగా స్పందించడం పట్లూరు గ్రామస్తుల ఐక్యతను గుర్తు చేస్తుందన్నారు. ప్రజలను నమ్మినవాడు నాయకుడవుతాడు. దేవుని నమ్మినవాడు భక్తుడు అవుతాడు అనడానికి నిదర్శనమే పట్లూరు గ్రామస్తుల ఐకమత్యమేనని అన్నారు. ఆలయ నిర్మాణ కమిటీకి ఎమ్మెల్యే ధనవంతు ఆర్థిక సహకారం రూ. 1,01,116 అందజేశారు. శ్రీ హనుమాన్ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్  దేవరదేశి అశోక్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సహకరించడం విశేషం అని కొనియాడారు. దైవానుగ్రహం ఉండడం వల్లనే శ్రీ హనుమాన్ మందిర నిర్మాణానికి పునాది పడ్డదని వివరించారు. పూర్వజన్మ సుకృత ఫలంగా ఆలయ కమిటీ నిర్మాణానికి గ్రామస్తులు నన్ను చైర్మన్గా నియమించడం అభినందనీయుడనని చెప్పారు. భక్తులే స్వయంగా ఆలయానికి వచ్చి విరాళాలు అందజేయడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటీసీ మధుకర్, మండల రైతు బంధు అధ్యక్షుడు నాయబ్ గౌడ్, పట్లూరు గ్రామ ఉపసర్పంచ్ మోయిజ్ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.