రిజర్వేషన్లు పెంచిన సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం

Published: Monday October 03, 2022
ఏఐటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవన్ నాయక్
వికారాబాద్ బ్యూరో 2 అక్టోబర్ ప్రజాపాలన : గిరిజనులకు ఆదివాసులకు 6 శాతం నుండి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచిన సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం నిర్వహించామని ఏఐటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవన్ నాయక్ అన్నారు. ఆదివారం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఏఐటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవన్ నాయక్ జలంతో శుద్ధి చేసి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏఐటిఎఫ్ అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులు ఆదివాసులు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి చేసిన పోరాట ఫలితం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆదివాసీల సంఘాలు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటారని తెలిపారు. రిజర్వేషన్లు పెంపుదలతో ఏ గిరిజన ఆదివాసి బిడ్డ నష్టపోకుండా చూడాల్సిన గురుతర బాధ్యత సీఎం కేసీఆర్ దేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలలో పెంచిన రిజర్వేషన్ను అమలు చేయాలని కోరారు. గ్రూప్ 1, 2. పొలీసు శాఖ, విద్యా సంస్థలలో పెంచిన రిజర్వేషన్ను అమలు చేయాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూముల సమస్యను పరిష్కరించాలని చెప్పారు. నవాబుల భూములను తాత ముత్తాతల నుండి సాగు చేస్తున్న భూములను వారికే పట్టా పాస్ పుస్తకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటిఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామలత బాయి, రాష్ట్ర కార్యదర్శి గోపాల్ నాయక్ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ధరమ్ సింగ్ నాయక్ జిల్లా కార్యదర్శి దశరత్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ నాయక్ జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ రాథోడ్ లక్ష్మీబాయి ఏఐటిఎఫ్ నాయకులు బలరాం భాను నాయక్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.