మల్టీ పర్పస్ స్కూల్, పార్కు కస్తూరిభా గాంధి పాఠశాలను సందర్శించిన మేయర్.

Published: Wednesday June 08, 2022

నగరంలో 4 వ రోజు పట్టణ ప్రగతి.

పార్కు అభివృద్ది పనులు, పాఠశాలల సమస్యలను తనిఖీ చేసిన మేయర్ సునిల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్.
 
 
* అధికారులకు అభివృద్ది పనుల పై ఆదేశాలు.
 
 
కరీంనగర్‌ జూన్ ప్రజాపాలన ప్రతినిధి :
ప్రజలకు కావల్సిన వసతి సౌకర్యాలను కల్పించి...జీవన ప్రమాణాలు పెంచడమే  మా ప్రధాన ఉద్దేశమన్నారు నగర మేయర్ యాదగిరి సునిల్ రావు. కరీంనగర్ లో సోమవారం  4 వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా సాగాయి. నగర మేయర్ యాదగిరి సునిల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్ ప్రభుత్వం ఆదేశించిన షెడ్యుల్ ప్రకారం పలు ప్రభుత్వ పాఠశాలలు, నూతనంగా నిర్మాణం చేస్తున్న మల్టి పర్పస్ పార్కు, మార్కెట్లను సందర్శించారు. మొదటగా నగరంలోని 60 వ డివిజన్ ముకరాంపుర ఏరియాలో గల మల్టిపర్పస్ తెలుగు, ఉర్థూ మీడియం ప్రభుత్వ పాఠశాలలతో పాటు నూతనంగా నిర్మాణం చేస్తున్న మల్టిపర్పస్ పార్కును స్థానిక కార్పోరేటర్ వాల రమణ రావు తో కలిసి సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో పలు సమస్యలను పరిశీలించి పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్మార్ట్ సిటీ ఆర్వీ కన్సెల్టెన్సీ అధికారులు, ఎజెన్సీ కాంట్రాక్టర్ తో కలిసి కొనసాగుతున్న వివిద అభివృద్ది పనులను తనిఖీ చేసి పరిశీలించారు. పార్కులో ఉన్న పెండింగ్ పనులను వేహవంతంగా పూర్తి చేయాలని ఏజెన్సీ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 14 డివిజన్ లో స్థానిక కార్పోరేటర్ దిండిగాల మహేష్ తో కలిసి సప్తగిరి కాలనీలోని కస్తూరిభా గాంధీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో పట్టణ ప్రగతిలో పరిసరాల పరిశపభ్రత పనులు చేపట్టడంతో పాటు విద్యార్థులు ఆడుకునేందుకు స్థానికంగా ఉన్న గ్రౌండ్ ను చదును చేశారు. అంతే కాకుండ స్థానికంగా ఉన్న మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను భవనంను స్థలాన్ని పరిశీలించారు. అనంతరం 35 వ డివిజన్ సప్తగిరి కాలనీలో స్థానిక కార్పోరేటర్ బుచ్చిరెడ్డితో కలిసి నూతనంగా నిర్మాణం చేసిన మార్కెట్ షెడ్లను పరిశీలించారు. మార్కెట్ షెడ్ల ప్రారంభంకు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. సప్తగిరి కాలని ప్రభుత్వ హై స్కూల్ ను సందర్శించి పట్టణ ప్రగతిలో పరిశుభ్రత పనులు చేపట్టారు. గతంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ వాకింగ్ ట్రాకును పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మిని పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునిల్ రావు మాట్లాడుతూ... ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడం కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లె పట్టణ ప్రగతిని ప్రజల వద్దకు తెచ్చారని అన్నారు. పట్టణ ప్రగతిలో ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం చేయాల్సిన కార్యక్రమాల పై ప్రత్యేక దృష్ఠి పెట్టి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. గుర్తించిన సమస్యల పట్ల ప్రణాళికలు రూపొందించి పనులు చేపట్టేందుకు చర్యలు తీస్కుంటుంన్నామని తెలిపారు. ప్రభుత్వం నుండి ప్రతి నెల విడుదళ చేసిన నిధులను కేటాయించి అభివృద్ది పనులు చేస్తున్నామన్నారు. ప్రజలకు కావల్సిన ప్రతి అవసరాన్ని తీర్చి... సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రగతిలో చేసే కార్యక్రమాలకు నిధుల కొరత లేదన్నారు. అంతే కాకుండ గత పట్టణ ప్రగతి నిధుల నుండి అభివృద్ది పనులు చేపట్టి పూర్తి చేసిన వాటిని ప్రారంభం చేసేందుకు చర్యలు తీస్కుంటున్నామన్నారు. 60 డివిజన్ పరిదిలోని మల్టిపర్పస్ ప్రభుత్వ పాఠశాలతో పాటు సప్తగిరి కాలనీలోని కస్తూరిభా మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కూడ వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎక్కడ కూడ ఇబ్బంది రాకుండ తగిన చర్యలు తీస్కుంటున్నామన్నారు. సప్తగిరి కాలనీ లో గతంలోనే పెద్ద స్టాం వాటర్ డ్పైనేజీ నిర్మాణం కుడ చేపట్టి పనులు కొనసాగిస్తున్వామని తెలిపారు. ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తుల మేరకు కార్పోరేటర్ల సహాకారం అన్ని కార్యక్రమాలను పట్టణ ప్రగతిలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. మగిలిన పది రోజు పట్టణ ప్రగతిలో ప్రజలంతా డివిజన్ల వారిగా సమస్యలను మా దృష్టికి తెచ్చినట్లయితే వాటన్నిటీని కూడ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గత నాలుగు రోజులుగా నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లో పట్టణ ప్రగతి కార్పోరేటర్ల ఆద్వర్యంలో అధికారులు, ప్రజల సహకారంతో విజయవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు వాల రమణ రావు, దిండిగాల మహేష్, బుచ్చి రెడ్డి, ఎస్ ఈ నాగమల్లేశ్వర్ రావు, ఈఈ మహేంధర్, కిష్టప్ప, డీఈ మసూద్ అలీ స్థానిక జివిజన్ల వార్డు కమిటీ సభ్యు, ప్రజలు పాల్గొన్నారు.