మహిళలకు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. పినపాక నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గ అధ్యక్షుడు వెన

Published: Thursday November 10, 2022
అశ్వాపురం( ప్రజా పాలన.) 
సెక్టార్ పరిధిలో చింతిర్యాల కాలనీ అంగన్వాడీ కేంద్రం లో తల్లులు మరియు డ్వాక్రా మహిళలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో చింతిర్యాల కాలనీ ఉప సర్పంచ్ వెన్న అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలనీ సత్వర న్యాయం కోసం తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ స్కీం ద్వారా పరిహారం 50వేల నుంచి 3లక్షల వరకు పొందవచ్చని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మరియు ప్రతి అంగన్వాడీ లో పౌష్టికాహారం అందరికీ అందేలా టీచర్లు పనిచేయాలని ప్రతి నెల గర్భిణీ స్త్రీలు పిల్లల బరువు తెలుసుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ధనలక్ష్మి ఎ ఎన్ ఎమ్ ఇందిర ఐ కె పి సిసి విజయలక్ష్మి వి వో సునీత అంగన్వాడీ టీచర్ అరుణ మరియు గర్భిణీ బాలింతలు మహిళలు పాల్గొన్నారు