తప్పనిసరిగా మాస్కు ధరించాలి

Published: Tuesday March 30, 2021

మధిర మార్చ్ 29, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం పోలీస్ కమిషనర్ శ్రీ తప్సిర్ ఇక్బాల్ ఉత్తర్వులమేరకు మరియు D. మురళీధర్, Addl. DCP(L&O) గారి ఆదేశామేర తెలియజేయునది ఏమనగా కరోనా సెకండ్ వేవ్ వైరస్ వ్యాప్తి నివారణ చర్యలో భాగంలో ఖమ్మం జిల్లా లోని అన్ని వాహనదారులు తప్పని సరిగా మాస్క్ ధరించాలని, ప్రతి ఆటో డ్రైవర్ అతనితో పాటు, ప్యాస్సెంజర్ కు కూడా మాస్క్ ధరించి ఉంటేనే ఆటో లో ఎక్కించుకోవాలని, బహిరంగ ప్రదేశాలలో అన్ని వేళలా మాస్క్ లు ధరించి ఉండాలని, RTC బస్ లోడ్రైవర్&కండక్టర్స్ కూడా మాస్క్ ధరించి ఉంటేనే ప్యాసెంజర్స్ ను బస్ ఎక్కించుకోవాలని ప్రభుత్వం వారు జారీ చేసిన నిభందలను ఖచ్చితంగా పాటించాలని, అలా పాటించని యెడల డిజాస్టర్ మెనేజమెంట్ యాక్ట్-2005 ప్రకారం జరిమానాలువిధించబడును అని , నిరంతర తనిఖీలు నిర్వహించబడుతాయి అని వాహనదారులకు తెలియజేసినారు.