ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

Published: Saturday December 10, 2022
డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ 
వికారాబాద్ బ్యూరో 9 డిసెంబర్ ప్రజా పాలన : సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పరిగి డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి నివాసం వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ సోనియాగాంధీ చొరవ వలన తెలంగాణ సిద్ధించడం చాలా సంతోషమని అన్నారు. సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభించడానికి అధికారికంగా సోనియా గాంధీ అనౌన్స్ చేయడం జరిగిందని తెలిపారు. 2014 జూన్ రెండవ తేదీ  తెలంగాణ ఆవిర్భావం ఘనత సోనియా గాంధీకి దక్కుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని తెలిసి కూడా తెలంగాణలో ఆత్మ బలిదానాలు ఆపుటకై తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణను ప్రసాదించినటువంటి సోనియాగాంధీ తల్లికి తెలంగాణ యావత్తు ప్రజలు రుణపడి ఉండాలని కోరారు. ప్రజలకు అబద్ధాల మాటలతో ఇంటికో ఉద్యోగం అని చెప్పి, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మోసం మాటలు చెప్పి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనతో బంగారు తెలంగాణ అని బంగారు కుటుంబాన్ని చేసుకున్నారని ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రజలు ఆశించిన ఫలితాలను పొందకపోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ విశ్వరూపాన్ని అందరూ గుర్తించి కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పరిగి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, కౌన్సిలర్ మల్లేష్ యాదవ్,కాంగ్రెస్ జిల్లా నాయకులు అక్బర్ హుస్సేన్, ఖదీర్, మాధవరెడ్డి, సర్పంచ్ రాజ పుల్లారెడ్డి, తౌరియా నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి జగన్, నాగవర్ధన్, రామకృష్ణారెడ్డి, ఇజాజ్ తదితరులు పాల్గొన్నారు.