ఉపాధి హామీ ఉద్యోగులకు వెంటనే పే స్కేల్ వర్తింపచేయాలి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామ

Published: Friday April 14, 2023

ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వెంటనే అమలు చేయాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల సంఘం జె ఎ సి అధ్యక్షుడు లింగయ్య కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల, గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులు 3874 మంది పనిచేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు 30 శాతం మేర తగ్గించడంతో తమ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నర్థకంగా మారిందని, తక్షణమే నిధులు , పనిదినాలు పెంచడం ద్వారా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఉపాధి హామీ ఉద్యోగులలో ఎక్కువ శాతం మంది మధ్యతరగతి వారేనని, అధిక ధరల వలన తాము ముందు నిర్ణయించిన  కూలీ రేట్లతో ఇబ్బంది పడుతున్నామని కూలీ రేట్లు పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వెంకట్రామిరెడ్డి,అంజిరెడ్డి, జగన్నాధం ప్రవీణ్,మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.