చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి ఐద్వా

Published: Friday March 10, 2023

 మధిర మార్చి 9 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శీలం పుల్లారెడ్డి కాలేజీలోచట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఐద్వా రాష్ట్ర నాయకులు బుగ్గ వీటి   సరళ డిమాండ్ చేశారు.గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక శీలం  పుల్లారెడ్డి డిగ్రీ కళాశాల నందు ఐద్వా  జిల్లా నాయకురాలు మండవ ఫణీంద్ర కుమారి అధ్యక్షతన మహిళా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గ వీటి సరళ,  బండి పద్మ మాట్లాడుతూ మహిళలకు పని ప్రదేశంలో ఎనిమిది గంటల పని విధానాన్ని అవలంబించాలని, విద్యాలయాల్లో ర్యాగింగ్ పేరుతో విద్యార్థులపై జరుగుతున్న  ఆగడాలను నివారించాలని, విద్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్, చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన సమాజంలో మహిళలపై వివక్షత, మహిళలకు వరకట్నం  లాంటి మూడవిశ్వాసాలు కొనసాగుతున్నాయని అట్లాంటి వాటిపై ప్రభుత్వం మహిళలను చైతన్యవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో  బి బిఆర్ఎస్ నాయకులు శీలంవెంకట్ రెడ్డి శీలం  పుల్లారెడ్డి డిగ్రీ కాలేజీ విద్యార్థులు   తదితరులు పాల్గొన్నారు.