జిల్లా కలెక్టర్ బదిలీతో విద్యార్థి, యువజన,సంఘాల సంబరాలు **

Published: Thursday February 02, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 01 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బదిలీపై విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ చౌక్ ఎదుట బాణాసంచ పేల్చి, మిఠాయిలు పంచుకొని, సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ జిల్లాలోని అవినీతి అధికారులు, జిల్లాలో జరిగిన అక్రమాలపై మెతక వైఖరి వహించడంతో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టని వెంటనే బదిలీ చేయాలని పలు ఉద్యమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయడం హర్షించదగ్గ విషయమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిన్న పోస్టింగ్ ఇచ్చినా కొత్త కలెక్టర్ 24 గంటల లోపే వేరే జిల్లాకు కేటాయించారని, జిల్లాకు ఇన్చార్జి కలెక్టర్ పాలన వద్దని, వెంటనే రెగ్యులర్ కలెక్టర్ ను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి పటేల్, అంబాల రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మసాడే చరణ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, తిరుపతి, ప్రణయ్, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.