ఎర్రుపాలెం మండలాలలో ప్రశాంతంగా ముగిసిన పదోతరగతి హిందీ పరీక్ష

Published: Wednesday April 05, 2023
ఎర్రుపాలెం, ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరిగిన పదో తరగతి హింది ఎక్సమ్ మధిర, ఎర్రుపాలెం మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని ఎంఈఓ తెలియజేశారు. మధిర మండలంలో మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలలో 1037 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా 1032 మంది పరీక్ష రాశారు. ఐదుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంఈఓ వై ప్రభాకర్ తెలియజేశారు. అదేవిధంగా ఎర్రుపాలెం మండలంలోని మూడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 514 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 511 మంది విద్యార్థులు హాజరయ్యారు. ముగ్గురు మాత్రమే గైర్హాజరైనట్లు ఎంఈఓ ప్రభాకర్ తెలియజేశారు. పదో తరగతి పేపర్ లీకేజ్ విషయం రాష్ట్ర అంతట సంచలనంగా మారిన తరుణంలో మధిర, ఎర్రుపాలెం మండలాలలో పోలీస్ వారి సహకారంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రెండు ఎగ్జామ్స్ ను పూర్తి చేసినట్లు తెలియజేశారు. ఇక ముందు జరగబోయే ఎగ్జామ్స్ కూడా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించనున్నట్లు ఎంఈఓ తెలియజేశారు.