సిపిఎం జనచైతన్య పాదయాత్ర ను జయప్రదం చేయండి

Published: Tuesday March 23, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు పిలుపు జిల్లా సమస్యలపై పోరాడేందుకు నిర్వహిస్తున్న సిపిఎం పాదయాత్ర జయప్రదం చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. ఈరోజు వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఏలే కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక రకాల హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు ముఖ్యంగా దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లాంటి అనేక హామీలు ఇచ్చిన అన్నారు. ఆ ఆ హామీలను ఇప్పటి వరకు నడిచిన ఆరు ఏండ్లల్లో ఏమాత్రం అమలు చేయలేదన్నారు.జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అదేవిధంగా మండల కేంద్రాల్లో 30 పడకల ఆసుపత్రిల ఏర్పాటు హామీలకే పరిమితమైందన్నారు. మూసి కాలుష్యం వల్ల జిల్లాలో నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ తీవ్రమైన అటువంటి ఇబ్బందులు పడుతున్నారని కాలుష్యంతో గ్రామీణ ప్రాంతాలు కాలుష్యం అయ్యాయని. ప్రభుత్వం కాలుష్యాన్ని అరికట్టే డబ్బులు పూర్తిగా విఫలమైందని అన్నారు. జిల్లాలో గత 2004 సంవత్సరంలో ప్రారంభమైన బునాదిగాని కాల్వ   పిల్లాయిపల్లి కాల్వ. బొల్లాపల్లి కాలువ ధర్మారం కాలువలు నేటికీ పూర్తి చేయలేక పోయారా అన్నారు. ఈ కాలంలో దాదాపు మూడు ప్రభుత్వాలు నలుగురు ఎమ్మెల్యేలు మారిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని అన్నారు. నాటి నుండి నేటి వరకు జిల్లా సమస్యలపైన పోరాడాలని కేవలం సిపిఎం మాత్రమే అన్నారు. భవిష్యత్తులో ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు జిల్లావ్యాప్తంగా ఈ పాదయాత్ర నిర్వహించి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను గుర్తించడం జరుగుతుందని ఆయన అన్నారు. అందుకే ఈ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పాదయాత్ర చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేముల మహేందర్, మండల కార్యదర్శి మద్దెల రాజయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి,సిపిఎం సీనియర్ నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి,సిపిఎం మండల కమిటీ సభ్యులు తుర్కపల్లి సురేందర్, పట్టణకార్యదర్శి కూర శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు కొండె కిష్టయ్య గాజుల ఆంజనేయులు, వాకిటి వెంకటరెడ్డి, చీర్క శ్రీశైలం రెడ్డి శాఖా కార్యదర్శులు, ప్రజా సంఘాల బాద్యులు పాల్గొన్నారు.