రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్

Published: Thursday June 17, 2021
కరోన కష్టకాలంలో  రైతుబంధు నిధులు విడుదల చేసిన ఘనత కెసిఆర్ దే
మధిర, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : మధిర టిఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం రాష్ట్రంలో ఓ పక్కన కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న మరో పక్కన వ్యవసాయం సీజన్ ప్రారంభం కాబోతున్న సమయంలో కరోన కష్ట కాలాన్ని సైతం లెక్క చేయక రైతులకు వ్యవసాయ సాగుకు రైతుబంధు సహాయం విడుదల చేసిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు రైతుబంధు కన్వీనర్ చావా వేణు పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో రైతులకు వ్యవసాయ సాగు చేసుకునేందుకు రైతుబంధు నిధులు విడుదల చేసినందుకు బుధవారం టిఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రంగి శెట్టి కోటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పట్టణ బాధ్యులు కనుమూరు వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై వి అప్పారావు, మార్కెట్ డైరెక్టర్ గుర్రాల సైదిరెడ్డి, కటికల సీతారామరెడ్డి, కొటారి రాఘవరావు, శ్రీనివాస్ రెడ్డి, జేవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.