పలువురు అధికారులకు వినతి

Published: Tuesday August 10, 2021
బాలాపూర్: ఆగస్టు 9, ప్రజాపాలన ప్రతినిధి : మా డివిజన్ లలో అభివృద్ధి జరగడంలేదని గత నెల జూలై 29 న మీర్ పెట్ కార్పొరేషన్ లో మేయర్ భర్త నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన దాని పై కార్పొరేషన్ కమిషనర్ కు స్థానిక ఎమ్మెల్యే కు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కు నీలా రవి నాయక్ వినతి. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో 29వ డివిజన్ కార్పొరేటర్ నీలా రవి నాయక్ గత నెల (29/7/2021) నాడు నా డివిజన్ కు ఇచ్చిన నిధులను మంజూరు చేసిన స్థానిక ఎమ్మెల్యే మంత్రి చెప్పిన మాటలు వినకుండా కో ఆప్షన్ సభ్యులు, కంటెస్టెంట్ కార్పొరేటర్ కలిసి ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసిన, ఈ సందర్భాన్ని కార్పొరేషన్లో అధికారులను, మేయర్ భర్త అయినటువంటి ముందు (గది)  సీట్లు ఉన్న దిప్ లాల్ చౌహన్ని 29వ డివిజన్ కార్పొరేటర్  నీలా రవి నాయక్  అడిగిన వెంబడే దీప్ లాల్ చౌహన్ కఠోరంగా, తమాషా చేస్తున్నావా అని దూషించడం ఒక మహిళ అని చూడకుండా మాట్లాడాడు, మేయర్.... రాదు ఏం చేసుకుంటావు... వారంలో రెండు రోజులు మాత్రమే వస్తుందినీ ఎటకారంగా సమాధానం చెప్పారు. మేయర్ ను  పిలవండి మాట్లాడుతానునీ పదే పదే అడిగినాను, అంత అవసరం ఉంటే ఇంటికి వచ్చి మీ సమస్యను చెప్పమని అన్నారు. ఈ విషయాలు అందరికీ తెలిసిన విషయమే.... అని కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి, అడిషనల్ కలెక్టర్ కు, నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి, తనకు జరిగిన అవమానాన్ని, నా డివిజన్లో నిధులను నాకే వచ్చేటట్లు, కో ఆప్షన్ సభ్యులు.. ప్రోటోకాల్ పాటించాలని అధికారులను ప్రాధేయ పడుతూ ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని పెద్ద మనసుతో ఆలోచించి మేయర్ భర్త అయినటువంటి దీప్ లాల్ చౌహన్ పై తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని సమర్పించారు.