దళిత మోర్చా నాయకుడి కుటుంబ వేడుకకు హాజరైన బిజెపి నాయకులు

Published: Saturday October 08, 2022
బోనకల్, అక్టోబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలో రావినూతల గ్రామంలో జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు తాళ్లూరు సురేష్ సోదరుడి వివాహా వేడుకకు బిజెపి నాయకులు హాజరయ్యారు. ముందుగా జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం స్థానిక నాయకులు నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువనేత బీపీ నాయక్, ఓబిసి మోర్చా జిల్లా కార్యదర్శి జంపాల రవి, మండల ప్రధాన కార్యదర్శి గంగుల నాగయ్య, మండల యువమోర్చా అధ్యక్షులు కాలాసాని పరశురాం, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మరీదు పరశురాముడు, జిల్లా నాయకులు సైదేశ్వర రావు, బానోత్ సైదులు తదితరులు పాల్గొన్నారు.