ఇరిగేషన్ అధికారులతో... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గా

Published: Thursday September 22, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు& భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు బుధవారం నాడు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ  సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ, పులుసు బొంత ప్రాజెక్ట్, వట్టి వాగు, లోటారి గండి, మరియు బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక ,మణుగూరు, మండలాలకు సంబంధించి గోదావరి నది  పరివాహక ప్రాంతం  వరదలు బ్యాక్ వాటర్ ముంపు ప్రాంత తదితర అంశాలపై చర్చించడం జరిగింది, ప్రత్యేక నిపుణుల కమిటీ  నియమించిందని, బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ పై సర్వే చేస్తున్నారని అన్నారు, అదేవిధంగా  చెరువులు కాలువలు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు, జిల్లాల అమలవుతున్న ప్రాజెక్టుల పనులు చెరువులు కాలువల పనులు ఎప్పటికప్పుడు పరిశీలించి పనులు పురోగతి అందించాలని ఆయన కోరారు, ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు*,
 
*ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ SE. వెంకటేశ్వర్ల రెడ్డి, ఏఈ సక్రు, మణుగూరు ZPTC పోశం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు*...
 
 
 
Attachments area