పీర్జాదిగూడలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ 284వ జయంతి వేడుకలు

Published: Thursday February 16, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 15 (ప్రజాపాలన ప్రతినిధి)
 పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ 284వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సేవాలాల్  జయంతి వేడుకలు, మహాభోగ్ బండార్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక& ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ఆర్టిఏ కమిషనర్ జి శంకర్ నాయక్.డిప్యూటీీ మేయర్లు కుర్ర శివకుమార్ గౌడ్, 
 కొత్త లక్ష్మిరవి గౌడ్, కమిషనర్ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. తొలుత సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య గురువు, దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బంజారాల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.             హైదరాబాద్ బంజారాహిల్స్ లో   బంజారాల భవనాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. అనంతరం మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కొసం సంత్ సేవాలాల్ చూపించిన మార్గం ఆదర్శనీయమన్నారు. ఆయన బోధనలను అందరూ ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుమన్ నాయక్, దొంతిరి హరి శంకర్ రెడ్డి, కౌడే పోచయ్య, అనంతరెడ్డి, నాయకులు బైటింటి ఈశ్వర్ రెడ్డి, పప్పుల అంజిరెడ్డి, పూజార్లు జూమ్ లాల్, చంద్ లాల్, పాండు,సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్లావత్ సక్రు నాయక్, ఉపాధ్యక్షులు
అంగోత్ తారా సింగ్, లూనావత్ చందూలాల్ నాయక్, వాంకుడోత్ రవీందర్ నాయక్, గుగులోత్ శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శి బి. ప్రవీణ్ రాథోడ్ (పులాని),జాయింట్ సెక్రటరీలు లకవత్ కిరణ్ కుమార్, తేజవత్ చందర్ నాయక్, ముడావత్ సంజీవ్ నాయక్, ధారావత్ సోమ్లా నాయక్, ఎ ఉపేందర్ నాయక్, పాండు నాయక్, జి ఉపేందర్ నాయక్, కోశాధికారి అజ్మీరా లింగ్యా నాయక్,ఆర్గనైజింగ్ సెక్రటరీ బానోత్ బికోజీ నాయక్, ధీరవత్ హరిలాల్ నాయక్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.