*సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు* సంతోషాన్ని వ్యక్తం చేసిన రైతు అశ్వాక్ వహీద్..

Published: Tuesday April 04, 2023
చేవెళ్ల ఏప్రిల్ 3, (ప్రజాపాలన):-

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేంద్రంలోని పల్గుట్ట గ్రామ పంచాయతీ లో తడి చెత్త ద్వారా తయారు చేసిన
సేంద్రీయ ఎరువు సత్ఫలితాలను  అందించిందని రైతు  అశ్వక్ వహిద్ హర్షం వ్యక్తం చేశారు.
జనవరి 11 న పల్గుట్ట గ్రామ పంచాయతీ నుంచి రూ. 7 వేలు వెచ్చించి ఎరువును కొనుగోలు చేసిన అశ్వాక్ వహీద్ తను సాగు చేస్తున్న పుచ్చకాయ పంటలో గతేడాది కంటే ఈ ఏడాది అధిక దిగుబడులు సాధించగా, సోమవారం పల్గుట్ట పంచాయతీ కార్యదర్శి టి. నరేష్ గౌడ్ ను చేవెళ్ళ మండలం రామన్నగూడ లో గల పంట పొలానికి ఆహ్వానించి
పూర్తిగా సేంద్రీయ ఎరువుతో అధిక దిగుబడితో (పంట) పుచ్చకాయలను అందజేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇకపై గ్రామపంచాయతీలో తడి పొడి చెత్త ద్వారా తయారైన ఎరువును తనకే
కోరారని, పంచాయతీ కార్యదర్శి నరేష్ అన్నారు.. తడి చెత్త ద్వారా మంచి ఫలితాలను రాబట్టిన గ్రామ పంచాయతీ పల్గుట్ట కార్యదర్శి మరియు సిబ్బందిని మండల స్థాయి అధికారులు అభినందించారు.