నేడే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనుగోళ్లపై కేంద్రం వైఖరి నిరసిస్తూ ధర్నా

Published: Monday December 20, 2021
మధుర డిసెంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి : మధిర నియోజకవర్గంలో ఈ నెల 20న గ్రామగ్రామాన నిరసనలుజిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మధిర నియోజకవర్గం ధాన్యం కొనుగోలుపై చేతులేత్తిసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ  వైఖరిని ఎండగడుతూ నిర‌స‌న‌లు చేప‌ట్టాలని సీఎం, టీఆరెస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో టీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20న సోమవారం రోజు మధిర నియోజకవర్గంలో అన్ని మండలాల్లో గ్రామగ్రామాన నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పిలుపునిచ్చారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి కేంద్రం చేతులెత్తేసిన విష‌యాన్ని రైతుల‌కు స్పష్టంగా వివ‌రించాల‌ని చెప్పారు. వ‌రికి బ‌దులుగా ఇత‌ర పంట‌లు వేయాల‌ని అయన రైతాంగాన్ని కోరారు. యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదని, దీనికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమన్న విషయాన్ని రైతులు గమనించగలరు