మండల కేంద్రంలో మతిస్థిమితం లేని యువకుడి హల్ చల్

Published: Wednesday June 08, 2022
బోనకల్ జూన్ 07 ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలో ఓ యువకుడు తన వింత చేష్టలతో ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్న సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బోనకల్ మండల కేంద్రంలో పాత పెట్రోల్ బంక్ ఎదురుగా అద్దెకు నివాసం ఉంటున్న చాపల మడుగు సుధాకర్ -అరుణ ల కుమారుడు లక్ష్మీకాంత్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేని వ్యక్తి లా ప్రవర్తిస్తూ, తన ఒంటిపై బట్టలు లేకుండా, పురుషులు లేని సమయంలో పలువురు ఇళ్లలోకి ప్రవేశించి మహిళలతో అసభ్యకర పదజాలంతో దూషిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. పలువురు పై రాళ్ళు రువ్వుతూ, పలు వాహనాలు ధ్వంసం చేస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కానీ పోలీసు వారు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పలువురు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా పోలీసు వారు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.