సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Monday October 11, 2021
సారంగాపూర్, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలానికి చెందిన 19 మంది లబ్దిదారులకు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 7 లక్షల 13 వేల రూపాయల విలువ చేసే సీఎం సహాయనిధి చెక్కులను సారంగాపూర్ రైతు వేదికలో స్థానిక ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల జమున జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సురేందర్ రైతుబంధు మండల కన్వీనర్ కోల శ్రీనివాస్ ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు జోగినపల్లి సుధాకర్ రావు సర్పంచులు గుర్రాల రాజేందర్ రెడ్డి ఆరే లక్ష్మీ ఢిల్లీ రామారావు పల్లపు వెంకటేష్ బెక్కెం జమున కొత్తూరి రాజేశ్వరి ఎంపీటీసీలు ఉప సర్పంచులు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.