బార్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి -జి హెచ్ ఆర్ అండ్ బి ఓ అసోసియేషన్

Published: Wednesday May 18, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ) :
 
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వానికి లక్షలు ఫీజులు చెల్లించి రెస్టారెంట్ అండ్ బార్ లు నిర్వహిస్తున్న యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గ్రేటర్ హైదరాబాద్ రెస్టారెంట్ అండ్ బార్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతో బార్ యజమానులు తీవ్రంగా నష్టపోవడం తో పాటు మానసిక ఆవేదనకు గురి అవుతున్నారని అన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తమ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు, కరోన ఎఫెక్ట్ తో గ్రేటర్ పరిధిలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న అని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రులు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.  వైన్స్ కు ఇస్తున్న పర్మిట్ రూమ్ లో నిబంధనలను కఠినంగా అమలు చేయడం, సమయపాలన, బెల్ట్ షాపులను నియంత్రిస్తే తాము పాల ఊబి నుంచి బయటపడ్డామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.