వరి దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

Published: Monday November 14, 2022

జన్నారం, నవంబర్ 13, ప్రజాపాలన: మండలంలోని దేవునికూడా మెుర్రికూడా కవ్వాల్ హాస్టల్ తండా గ్రామాలలో రైతులు కోసం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తుందని ఆమె అన్నారు. మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను అమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు గుర్రం సురేష్ గోపాల్ రెడ్డి, బాణావత్ జయశ్రీ సంతోష్, లకావత్ హాస్లీ బాయ్, లకావత్ లక్ష్మి కాలీరాం, మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీపతి పద్మ, మార్కెటింగ్ వైస్ చైర్మన్ గొట్ల రాజేష్ యాదవ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జాడి గంగాధర్, మండల కోఆప్షన్ సభ్యుడు మున్వర్  అలిఖాన్, ఏ పి ఎం సిహెచ్ బుచ్చన్న, మండల ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భరత్ కుమార్, సతీష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.