వాల్మీకి బోయ జాతిని ఎస్టీ జాబితాలో చేర్చాలి

Published: Monday October 10, 2022
జిల్లా వాల్మీకి బోయ సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్
వికారాబాద్ బ్యూరో 9 అక్టోబర్ ప్రజా పాలన : వాల్మీకి బోయ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని వికారాబాద్ జిల్లా వాల్మీకి బోయ సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వాల్మీకి బోయ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని చేతులకు నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వాల్మీకి బోయ సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్ అశోక్ కుమార్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో సీఎం కేసీఆర్ 2018 సాధారణ ఎన్నికల ప్రచార బహిరంగ సమావేశంలో వాల్మీకి బోయ సామాజిక వర్గం చాలా పేదవారు అని పేర్కొన్నారు. వాల్మీకి బోయ వారి జీవన పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని గుర్తు చేశారు. వాల్మీకి బోయ సామాజిక వర్గం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వైద్యపరంగా ఎదగాలంటే వారికి సమున్నత స్థానం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. వాల్మీకి బోయ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడానికి చెల్లప్ప కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు పలు రాష్ట్రాలలో వాల్మీకి బోయ సామాజిక వర్గం స్థితిగతులను పరిశీలించి అసెంబ్లీలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తున్నట్లు బిల్లు పాస్ చేశారని వివరించారు వాల్మీకి బోయ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చకుండా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచి జీవో తేవడం అన్యాయమని విమర్శించారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకోనైనా వాల్మీకి బోయ జాతిని వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంజయ్య మల్లేశం శ్రీశైలం మహేందర్ బుచ్చయ్య జగన్ రమేష్ శ్రీనివాస్ తదితర వాల్మీకి బోయ సామాజిక వర్గం సభ్యులు పాల్గొన్నారు.