టిపియుఎస్ రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షునిగా కమ్మేట ప్రధానోపాధ్యాయులు గణపురం సురధీర్ ఏకగ

Published: Monday December 19, 2022

నగరంలోని సాహితీ కళాశాల బి ఎన్ రెడ్డి నగర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయసంఘం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు ఆధ్వర్యంలో చేవెళ్ల మండలం కమ్మెట పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణపురం సురధీర్ టిపియుఎస్ రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన బాధ్యతలు తీసుకున్న సురధీర్ మాట్లాడుతూ  తమపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన పెద్దలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ సిపిఎస్ (కాంటి) బ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి ఆర్థిక భద్రతతో కూడిన "పాతపెన్షన్ విధానం అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల అనుగుణంగా, నియామక ప్రక్రియ పూర్తిగా 2004 సెప్టెంబర్ కంటే పూర్వం జరిగినందున తక్షణమే డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు 'పాతపెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు.రాబోవు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో జిఎస్టి ఉపాధ్యాయులకు ఓటు హక్కు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి మూడు డి.ఎ. లను వెంటనే విడుదల చేయాలి అని కోరారు.  ప్రభుత్వపాఠశాలలలో ఉపాద్యాయుల పోస్టులు ఖాళీగా ఉండేటం వలన విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఎస్ జి టి లకు స్కూల్ అసిస్టెంట్లు గా, 'స్కూల్ అసిస్టెంట్లకు జిహెచ్ఎం లుగా ప్రమోషన్ల కల్పించి విధ్యావ్యవస్థను పటిష్ట పరుచాలన్నారు.
పాఠశాలలలో శుభ్రతకు ప్రత్యేక నియామకాలు చేపట్టి, పాఠశాల లను శుభ్రంగా ఉంచాల్సిన బాద్యత ప్రభుత్వానిది అని గుర్తుచేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ హెచ్ ఎస్ సదుపాయం వెంటనే అమలులోనికి తీసుకొచ్చి ఉద్యోగుల కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాలని ఈ సందర్భంగా కోరారు.ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తెలంగాణ ప్రాత ఉపాధ్యాయ సంఘం తరపున పనిచేయడానికి అవకాశం కల్పించిన కార్యకర్తలకు సంఘ పెద్దలకు సురధీర్ ధన్యవాదాలు తెలిపారు.