గ్రూప్-1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Published: Saturday October 08, 2022
 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 7 అక్టోబర్ ప్రజాపాలన :  గ్రూప్-1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధింత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై పోలీస్,  విద్య, విద్యుత్, రవాణా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో  14 పరీక్ష కేంద్రాల్లో 4857 మంది అభ్యర్థులు గ్రూప్-1 పరీక్షలకు హాజరు అవుతున్నట్లు ఆమె తెలిపారు.  అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా పరీక్ష నిర్వహించే సమయంలో నిరంతర విద్యుత్తు ఉండేలా చూడాలని.. అదేవిధంగా టెక్నికల్ సిబ్బందిని  కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో టాయిలెట్స్, త్రాగునీరు, ఫర్నిచర్ సమకూర్చాలని కలెక్టర్ సూచించారు. పరీక్షకు హాజరయ్యే మహిళా అభ్యర్థులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సౌకర్యాలు కల్పించాలని ఆమె అన్నారు. వాష్ రూమ్ కు వెళ్లే దారులకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.  పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ ద్వారా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు తీసుకువచ్చే లగేజ్ ని భద్రపరిచేందుకు ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యం నిమిత్తం రైల్వే స్టేషన్, బస్ స్టేషన్,  ఎన్టీఆర్ చౌరస్తా లాంటి  స్థలాల్లో  బస్సుల ఏర్పాటు చేయాలని వికారాబాద్ డిపో మేనేజర్ ను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించాలని సూచించారు. ఇన్చార్జి డిఆర్ఓ,  వికారాబాద్ ఆర్డీవో సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డిఆర్ఓ అశోక్ కుమార్,  వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి, డి.ఎస్.పి.  సత్యనారాయణ,  తహసిల్దారులు  షర్మిల, హెచ్. సెక్షన్ సూపరిండెంట్ రవీందర్ దత్తు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ నాయక్ ,  వికారాబాద్ డిపో మేనేజర్ మహేష్ , అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ఇన్చార్జి ప్రభు,  ఎంఈఓ బాబుసింగ్ తదితరులు పాల్గొన్నారు