ఆర్థిక సహాయం అందజేత...

Published: Monday October 04, 2021
సారంగాపూర్, అక్టోబర్ 03 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ కేంద్రానికి చెందిన సూర లచ్ఛన్న మనవరాలు రెండేళ్ల వయస్సు పుట్టినప్పటినుండి రెండు కాళ్ళు పనిచేయడం లేదు. తల్లి మతిస్థిమితం కోల్పోవడం కుటుంబం పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. పాపా అమ్మమ్మ తాత సమక్షంలో పెరుగుతూ వారి ఆర్ధిక పరిస్థితి కూడ దినస్థితిగా ఉండడంతో పాపా చికిత్స కోసం బిజెపి మండల్ అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ 5 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ అధ్యక్షుడు కలాగిరి మధు రెడ్డి బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి శాంతయ్య బీజేపీ సీనియర్ నాయకులు ఆనంతుల స్వామి మోహన్ ఉపేందర్ కార్యకర్తలు పాల్గొన్నారు.