సిఐటియు అద్వర్యం లో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కర

Published: Tuesday May 17, 2022
మంచిర్యాల టౌన్, మే 16, ప్రజాపాలన : 
 
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏ ఒ కు వినతి పత్రం  అందజేశారు.ఈ సందర్భంగా  సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు పిఆర్సి తరహా వేతనాలు ఇస్తామని  హుజురాబాద్ ఎలక్షన్ సందర్భంగా   హామీ ఇచ్చారని పేర్కొన్నారు., కాని ఇప్పటి వరకు ఇవ్వకపోగా ప్రస్తుతం ఇస్తున్న చాలి చాలని వేతనాలు కూడా మూడు నెలలు గడిచినా ఇవ్వ లేదని అన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల కార్మికులు పస్తులు ఉండే దుస్థితి తలెత్తిందని, ప్రభుత్వం అందించే అలవెన్స్ సమయానికి అందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న వేతనాన్ని   వెంటనే చెల్లించాలని  లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని  హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు రాజలింగు,అధ్యక్షులు సాయి కృష్ణ,లచ్చన్న, బాణయ్య, సత్తయ్య, సుజిత్, శంకరయ్య, భూమయ్య, నర్సయ్య, బాణయ్య,తదితరులు పాల్గొన్నారు.