యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

Published: Wednesday September 01, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 31 ఆగస్ట్ ప్రజాపాలన : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండలం కుక్కింద గ్రామంలో గ్రామ సర్పంచ్ కారంజి వీరేశం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్  అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్తగా గుర్తింపు పొంందిన మహనీయుడు అని కొనియాడారు. దళితుల పై అంటరాని తనాన్ని తొలిగించాలని ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ కలాన్ సర్పంచ్ తొొంట పరమేష్, విగ్రహ దాత పెద్ద కరీం, వార్డ్ మెంబర్ వెంకటయ్య, నర్సింలు, కొండాపూర్ కలాన్ గ్రామ పెద్ద కరణం రవీందర్రావు,  గ్రామ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.