ఆదిబట్ల-కొంగర వెళ్లే దారి తాత్కాలిక బ్రిడ్జి నిర్మాణం

Published: Wednesday October 13, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని  ఆదిబట్ల నుండి (ORR) మరియు కొంగర కలాన్ వెళ్లే రోడ్డు మార్గం ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా రోడ్డు ధ్వంసమైంది, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది, ఈరోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ పెద్దలతో కలిసి సందర్శించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ గారితో బ్రిడ్జి నిర్మాణం గురించి చర్చించామని  తెలిపారు. అతి త్వరలోనే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నూతన బ్రిడ్జి నిర్మాణా పనులు చేపడతామని గ్రామస్తుల సమక్షంలో తెలిపారు. సుమారుగా మూడు కోట్ల రూపాయలతో టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ రోడ్డును రాకపోకలకు వినియోగించుకునే ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ రోడ్డు ధ్వంసమై ప్రమాదకరంగా ఉన్నందున బ్రిడ్జి నిర్మించే వరకు దూరం అయినా వేరే రోడ్డు మార్గాన వెళ్లాలని ప్రజలకు సూచించిన మర్రి నిరంజన్ రెడ్డి గారు మంగళవారం తన సొంత డబ్బులు లు లక్ష రూపాయలకు పైగా వెచ్చించి వేయించి తాత్కాలిక వంతెనను నిర్మించారు. ఈ కార్యక్రమంలో 1 వార్డు కౌన్సిలర్ లావణ్య పాండురంగారెడ్డి, జమ్మ బీరప్ప, సురేష్, చేగురి రమేష్, టీసీఎస్ యాదయ్య, పల్లె సాయి బాబా గౌడ్, సోమయ్య, కోరే శివ, శ్రీకాంత్ గౌడ్, రఘు గౌడ్, రఘువీరా చారి గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.