ఎస్సీ,ఎస్టీ,బీసీలకు పోలీస్ నియామకాల్లో అన్యాయం.ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ కూరపాటి సునీల్

Published: Monday September 12, 2022
మధిర,సెప్టెంబర్ 11ప్రజా పాలన ప్రతిని ధిరాష్ట్ర పోలీసు నియామక మండలి నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో బీసీ,ఎస్సీ,ఎస్టీలకు అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ కూరపాటి సునీల్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలోఆదివారం స్థానిక శాసనసభ్యులు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం ఇంచార్జి మిరియాల వెంకటరమణ గుప్తాని కలసి ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ మధ్య కాలంలో నిర్వహించిన ఎస్ఐ,కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని తెలిపారు. గతంలో రెండు సార్లు ఇచ్చిన 2014,2018 నోటిఫికేషన్లలో ఓసీలకు 80,బీసీలకు 70,ఎస్సీ ఎస్టీలకు 60 మార్కు ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టి,మార్కులు లేకుండా పరీక్షను నెగెటివ్ నిర్వహించడం జరిగిందన్నారు. నూతనంగా ఇచ్చిన 2022 నోటిఫికేషన్లో అందరికీ కామన్గా నెగటివ్ మార్క్స్ పెట్టి 60 మార్కులకే కటాఫ్ తీసుకురావడానికి ఎస్సీ, ఎస్టీ,బీసీలు అభ్యర్థులు వ్యతిరేకించారని వివరించారు.ఓసీలకు 20 మార్కులు తగ్గించినప్పుడు ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 20 మార్కులు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రమైన రిజర్వేషన్ రూల్కు వ్యతిరేకంగా రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని కొత్త జీవో జారీ చేసి ఎస్సీ,ఎస్టీలకు 40, బీసీలకు 50,ఓసీలకు 60 మార్కులుగా క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టి ఫలితాలు విడుదల చేయాలని కోరారు.అదే విధంగా ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో దాదాపు 22 ప్రశ్నలు తప్పులుగా రావడం,కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో 23 ప్రశ్నలు తప్పులుగా రావడం బోర్డు తప్పిదమని,తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు ప్రతి అభ్యర్థులకు మార్కులు కలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ విషయం భట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ఎస్సీ,ఎస్టీ బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ నాయకులు కనక పూడి శ్రీను మాదిగ,దేవదాసు మాదిగ,వేల్పుల పవన్ కళ్యాణ్ మాదిగ,బల్లె పోగు రామారావు మాదిగ,ఎస్సీ,ఎస్టీ,బిసి ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులు తదితరులు ఉన్నారు.
 
 
 
Attachments area