ఇబ్రహీంపట్నoలో రెడ్ల రాజ్యమే నడుస్తుంది, మీ ఓట్లేంత మా బహుజనుల ఓట్లు ఏంత.? ఎవరు ఎమ్మెల్యే లు క

Published: Monday October 10, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 9ప్రజాపాలన ప్రతినిధి

ఆదివారం రోజున ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార ప్రదాత, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరామ్ గారి 16వ వర్ధంతి సందర్భంగా అంబేడ్కర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది.
అసెంబ్లీ ఇంచార్జ్ పల్లాటి రాములు , & అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్ మాట్లాడుతూ.ఓట్లు మావీ-సీట్లు మీవా.? అని పాలకవర్గాలను ప్రశ్నించి, పీడిత జాతుల్లో ఆత్మగౌరవమున్న నాయకులను తయారు చేసి వాళ్లను చట్ట సభలకు పంపిన మహనీయుడు కాన్షీరాం గారు. ఈ రోజు ఆ పోరాట యోధుడి స్పూర్తితో మనం అందరం ఆయన అహర్నిశలు శ్రమించి సృష్టించిన బి ఎస్ పి వెంట నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ వచ్చే ఇబ్రహింపట్నం అసెంబ్లీ ఎన్నికలల్లో బీసీ అభ్యర్ధినీ బలపరచి అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుంటాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో.
అసెంబ్లీ ఇంచార్జ్ పల్లాటి రాములు అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్, ఉపాధ్యక్షులు ధార యాదగిరి, కోశాధికారి కొండ్రు రఘుపతి, జిల్లా మహిళా కన్వీనర్ కంబాలపల్లి శాంత,
మండల కన్వీనర్
తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు వద్ధిగల్ల బాబు, కోశాధికారి పట్నం రమేష్ కురుమ,
ఆదిభట్ల మున్సిపాలిటీ అధ్యక్షులు బంగారుగల్ల మహేందర్, ప్రధాన కార్యదర్శి  వడల క్రాంతి కుమార్ కార్యదర్శి జోగు స్వామి, సీనియర్ నాయకులు
గౌరెల్లి గ్రామ కన్వీనర్ లు గ్యార రవి, బండ నవీన్ రెడ్డి
పోల్కంపల్లి సెక్టార్ అధ్యక్షులు కంబాలపల్లి కిషన్ పెద్ద ముద్దని ధనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.