చిన్న పిల్లల ఆరోగ్య గ్రోత్‌ మానిటరింగ్‌ కార్డుల పంపిణీ

Published: Saturday July 02, 2022
మల్లాపూర్ జులై 01 ( ప్రజాపాలన ప్రతినిధి): మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలలో శుక్రవారం ఐదేండ్లలోపు పిల్లల పై ప్రత్యేకంగా దృష్టి సారించి నిత్యం వారి ఎదుగుదల,ఆరోగ్యం,ఎత్తు, బరువును ప్రామాణికంగా తీసుకొని వారి ఆరోగ్యస్థాయిని నిర్ధారించే  గ్రోత్‌మానిటరింగ్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం  నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సాయికుమార్, సీడీపీవో తిరుమల దేవి, ఐసిడిఎస్ డి శైని, కలిసి కార్డులు పంపిచేశారు. సీడీపీవో మాట్లాడుతూ 0-5 ఏండ్ల వయస్సున్న ప్రతి ఒక్కరి ఆరోగ్యస్థితిగతుల పర్యవేక్షిస్తూ మండలం లోని అన్ని అంగన్‌వాడీకేంద్రాల్లో ప్రతినెలా 1వ తేదీన పిల్లల బరువు, ఎత్తు, జబ్బచుట్టు కొలతను పరీక్షించి.. వయస్సుకు తగినట్టుగా ఉన్నదీ, లేనిది కార్డులో నమోదుచేస్తారు. ఇలా రికార్డు చేసే సమయంలో ఎంపిక చేసిన రంగులను వినియోగిస్తారు. ఆకుపచ్చ రంగు సాధారణ స్థాయిని, పసుపు రంగు తక్కువ పోషక లోపాన్ని, ఎరుపు రంగు పోషకలోపాన్ని సూచిస్తాయి. అతితక్కువ బరువు, అతి తీవ్ర పోషక లోపం (ఎస్‌ఏఎం), తక్కువ తీవ్ర పోషక (ఎంఏఎం), అతి తక్కువ ఎత్తు లేదా బరువు పొడవు గుర్తించిన పిల్లలు మెడికల్‌ ఆఫీసర్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా వైద్యులచే పరీక్షించి మందులు ఇస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.