అబాకస్ పద్ధతి ద్వారా గణిత బోధన

Published: Wednesday January 11, 2023
యజ్ఞ ఫౌండేషన్ కరస్పాండెంట్ ఉజ్వల్ రాజ్
వికారాబాద్ బ్యూరో 10 జనవరి ప్రజా పాలన : గణితం అంటే భయం పోగొట్టేందుకు ఆసక్తిని పెంపొందించేందుకు అబాకస్ గణిత పద్ధతి చాలా సులువైందని యజ్ఞ ఫౌండేషన్ కరస్పాండెంట్ ఉజ్వల్ రాజ్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని దన్నారం సమీపంలోని స్వామి వివేకానంద గురుకుల్ హ్యూమన్ ఎక్సలెన్స్ స్కూల్ ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ ఐదవ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేలిక పద్ధతిలో గణితం సమస్యలు సాధించుట, పెన్ను పేపర్ లేకుండానే లెక్కలు చేయడం వలన మెదడు చురుకుదనము, ఏకాగ్రత పెరుగుతుందని స్పష్టం చేశారు. స్వామి వివేకానంద గురుకుల్ స్కూల్ ధన్నారంలో అబాకస్ పద్ధతి ద్వారా గణిత అభ్యాసము గత ఐదు సంవత్సరాల నుండి బోధిస్తున్నామని వివరించారు. వికారాబాద్ పట్టణంలోని ఎస్ఎల్ బి కొత్తగడి, చించల్పేట్, భాష్యం, టీఎస్ డబ్ల్యూ ఆర్ ఐ పాఠశాలలో స్వామి వివేకానంద గురుకుల్ విద్యార్థులు ఉపాధ్యాయులు వెళ్లి అబాకస్ ద్వారా గణితం అభ్యాసం చేయించారని తెలిపారు. అబాకస్ మోటివేషన్ తో పాటు గురుకుల్ విద్యార్థులు టైక్వాండో శిక్షణ కార్యక్రమాలను కూడా ఎస్, ఎల్ ,బి  నాగార్జున స్కూల్ లో నిర్వహించామని వెల్లడించారు. టైక్వాండో నేర్చుకున్నటువంటి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం శారీరక దారుడ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు. టైక్వాండోను బాలికలు తమ ఆత్మ రక్షణకై శిక్షణ తీసుకోవాలని సూచించారు.