వరి ధాన్యాన్ని ఎక్కువగా తూకం చేస్తూ నష్టపరుస్తున్నారని రైతుల ధర్నా, రాస్తారోకో

Published: Tuesday December 07, 2021
కోరుట్ల, డిసెంబరు 06 (ప్రజాపాలన ప్రతినిధి) : వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తరుగు పేరిట 3 కిలోల వరి ధాన్యాన్ని ఎక్కువగా తూకం చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతూ వేములవాడ- కోరుట్ల  రహదారిపై సుమారు గంట పాటు రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ విషయమై కొనుగోలు నిర్వాహకులను అడగగా మిల్లర్ లే మూడు కిలోల ధాన్యాన్ని తరుగు తీయాలంటూ తెలిపారని వారి సూచనల మేరకే తరుగు తీయడం జరుగుతుందన్నారు. రైతులు ధర్నా చేపడుతున్న విషయాన్ని తెలుసుకొని తహశీల్దార్ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి కోత లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని సూచించడంతో రైతులు ఆందోళన విరమించారు.