వైద్య, ఆరోగ్య రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్ర

Published: Thursday September 29, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా పాలన.
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నందు వంటగది భవనాన్ని మరియు రోగులకు ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు .
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ,
తెలంగాణ ప్రభుత్వం వైద్య , ఆరోగ్య రంగానికి కోట్లాది రూపాయలు నిధులను కేటాయించి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తుందని అన్నారు, మణుగూరు మండలంలోని వంద పడకల ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు, పినపాక నియోజకవర్గం ప్రజలకు ప్రభుత్వ వైద్యం తీసుకురావడంతో పాటు రాబోయే రోజులలో అదనంగా మరిన్ని ఆసుపత్రులు నిర్మాణం జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు, కరోనా విపత్కర సమయంలో వైద్యులు పారామెడికల్ సిబ్బంది అందించిన సేవలను మరవలేనివి అన్నారు, వైద్యరంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక  మార్పులకు శ్రీకారం చుట్టింది అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు కల్పించినందుకు గాను ప్రభుత్వం ఆధునిక యంత్ర పరికరాలను ఏర్పాటు చేస్తున్నది అన్నారు. తెలంగాణను దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే  సీఎం కేసీఆర్  సంకల్పం అని పేర్కొన్నారు .ఆరోగ్యవంతమైన తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్  వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తూ ప్రాధాన్యత కల్పిస్తున్నారని గుర్తు చేశారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్  పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు అన్నారు..