32 వ డివిజన్ లో ఏజెండా అంశాలపై అవగాహన కల్పిస్తున్న కార్పొరేటర్

Published: Monday June 21, 2021
బాలపూర్, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా  కలెక్టర్ ఆదేశాల మేరకు పురపాలక చట్టం 2019 లోని సెక్షన్ 17, 30 & 31 ననుసరించి నగరపాలక సంస్థ మీర్ పేట్ పరిధిలో అన్ని వార్డుల యందు కమిటీల సమావేశం నిర్వహించి తదనుగుణముగా ప్రణాళికను రూపొందించి వలసిన సందర్భంలోని 32వ వార్డ్ కార్పొరేటర్ వేముల నరసింహ్మ ఆధ్వర్యంలో కాలనీలో ప్రజల కమిటీ సమావేశం ఆదివారం నాడు ఉదయం 8:00 గంటలకు వార్డు పరిధిలోని ప్రధాన కూడలిలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కార్పొరేటర్ తో పాటు వార్డు ఆఫీసర్ ఉపేందర్, వార్డు ప్రజలతో చర్చించి నిర్ధారణ చేసిన అంశములను (1) పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంటు (2) హరితహారం (3) తాగునీరు సరఫరా (3) పార్కులు, ఆట స్థలము, పబ్లిక్ టాయిలెట్లు నిర్వహణ (4) అస్తి పన్ను ఇతర పన్నుల వసూలు (5) అక్రమ నిర్మాణాలు/ నిబంధనలకు విరుద్ధమైనవి (6) కళలు , సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు మొదలైన వాటికి ప్రోత్సహించుట పలు అంశములపై డివిజన్ ప్రజలందరూ హాజరై చర్చించిన అంశములను రికార్డు చేసి కార్పొరేటర్ సంతకంతో పలు కాలనీలు ఉపేందర్ కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సమావేశంలో 32వ డివిజన్ లోని  న్యూఅయోధ్య నగర్, అయోధ్య నగర్, ఓల్డ్  బాలాజీ నగర్, ఎస్ ఎల్ ఎన్ ఎస్ కాలనీ P-2, హుడాకాలనీ ల అసోసియేషన్  కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, ప్రజలు పలు విషయాల పై చర్చించడం విన్నవించడం జరిగిందిని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు స్థానిక కార్పొరేటర్ వేముల నరసింహ్మ తెలియజేశారు.