రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి రోహిత్ రెడ్డికి లేదు

Published: Monday January 09, 2023
* అమ్ముడు పోయిన వ్యక్తి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
* టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 08 జనవరి ప్రజాపాలన : కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన రోహిత్ రెడ్డి ఎంతకు అమ్ముడు పోయాడో ముందు ప్రజలకు వివరించాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి డిమాండ్ చేశారు. టిపిసిసి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత అముడు పోయిన ఎమ్మెల్యేకి లేదని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీరారెడ్డి విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ నీకు టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తే...కాంగ్రెస్ పార్టీ నీకు ఎమ్మెల్యే టికెట్ మీ అమ్మకు జడ్పిటిసి టికెట్ ఇప్పించి గెలిపించిన కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిన చరిత్ర నీదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న నీవు దిగజారుడు తనం అర్థమవుతుందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాలో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నావని విమర్శించారు. సర్పన్ పల్లి ప్రాజెక్టు వద్ద ప్రభుత్వ భూములను కబ్జా చేసి వ్యాపారం చేస్తూ పైసలు వసూలు చేసుకుంటుంది నువ్వు అని జిల్లా అంతా  కోడై కూస్తుంది. ఇప్పటికైనా నువ్వు చిల్లర రాజకీయాలు చిల్లర చేష్టలు మానుకొని హోదా గల రాజకీయాలు చేయాలని హితవు పలికారు. డబ్బులకు అమ్ముడుపోయే సంస్కృతిని జిల్లాలు తెచ్చిన ఘనత నీదేనని అన్నారు. జిల్లాలో  నువ్వు ఎమ్మెల్యేగా చేస్తున్న అక్రమాలు అవినీతిని కాంగ్రెస్ పార్టీ బయటికి తెచ్చి ప్రజా కోర్టులో నిన్ను దోషిగా నిలబెడతామని అన్నారు. నాలుగు రూపాయలు ఎక్కువగా వస్తాయంటే కే ఏ పాల్  పార్టీలో కూడా చేరడానికి రోహిత్ రెడ్డి సిద్ధపడతాడని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి విమర్శించారు.