విశ్రాంతి గృహాలను వెంటనే వాక్సినేషన్,క్వారంటేన్ సెంటర్ గా మార్చాలి

Published: Tuesday May 11, 2021

పటాన్చేర్, మే 10, ప్రజాపాలన ప్రతినిధి : కోట్లాది రూపాయ ప్రజాధనాన్ని వృధాగా చేస్తున్న పాలకులు విశ్రాంత గృహాన్ని వెంటనే వ్యాక్సినేషన్ కు లేదా క్వారంటెన్ సెంటర్ గా మార్చాలని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ, పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్చెరులో నిర్వహించిన సమావేశంలో సోమవారం ఉదయం పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ పటాన్ చేరు ప్రభుత్వాసుపత్రిలో ప్రతినిత్యం వ్యాక్సినేషన్ కొరకు కరోనా టెస్టుల కొరకు వేలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారని, అదేవిధంగా కరోనా వ్యాధి బారినపడిన రోగులకు, ఓపి పేషెంట్లకు ఇది ఒక్కే ఆసుపత్రి కావడంతో ఒక్కరి నుండి మరొక్కరికి కరోనా వ్యాధి వ్యాపిస్తుందని, అప్పుడు కరోనా కట్టడికి కష్టమౌతుందన్నారు, ముఖ్యంగా పటాన్చెరువు పట్టణానికి నేషనల్ హైవే ఆనుకొని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా  ఉన్న ఐబి భవనము కోట్లాది రూపాయలతో నిర్మించారని ఇట్టి నిర్మించిన భవనం గత ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నదని, ప్రజల పన్నుల తోటి పటాన్ చేరు పట్టణంలోని జిహెచ్ఎంసి లో సుమారు 5 కోట్ల రూపాయల పన్నులు  వసూల వుతున్నప్పటికీ అట్టి పన్నుల ద్వారా ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టి వృధాగా ఉంచడం, ప్రస్తుత కరోనా సమయంలో అధికారులకు ఇలాంటి విషయాల్లో ముందుచూపు లేకపోవడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవాచేశారు, తక్షణమే ఐబీ విశ్రాంత భవనాన్ని వ్యాక్సినేషన్ కొరకు లేదా క్వారైంటెన్ సెంటర్ గా మార్చాలని పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ తరపున కార్మిక విభాగం ఐఎన్టీయూసీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు