పాలేరు నవంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలో జరుగుతున్న ఆత్

Published: Thursday December 01, 2022
పాలేరు నవంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం సందర్భంగా బుధవారం. గువ్వల గూడెం గ్రామం నుండి. డీజే సౌండ్ ఆటపాటలు కోలాట నృత్యాల తో  ఆత్మీయ సమ్మేళన వేదిక వద్ద కు చేరుకున్నారు. 
 ఈ కార్యక్రమానికి. ముఖ్య అతిథిగా హాజరైన పాలేరు శాసనసభ్యులు.
 కందాల ఉపేందర్ రెడ్డి, తో పాటు నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆయనకి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఎవరి స్వార్థం కోసం మీలో మీరు కొట్లాడు కోవద్దు అని, గువ్వలగూడెం గ్రామంలో మీలో  మీకే కొట్లాట్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని,గొడవలు పెట్టే రాజకీయం చేయాలనుకుంటున్నారని. ఎన్నికల్లో  మీకు ఎవరైతే మంచి  చేస్తారనుకుంటారో వారికే ఓటెయ్యండని,మీ గ్రామాన్ని అభివృద్ధి పరిచే భాద్యత నాది అని అన్నారు.
అలాగే గువ్వలగూడెం గ్రామానికి 50 - 60 ఇళ్లు ఇప్పిస్తా...ఇంకో ఐదు ఇళ్లు నా సొంతంగా ఇస్తానని అన్నారు.బయటి వ్యక్తులను నమ్మొద్దు, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉన్నాం బ్రహ్మయ్య, రూరల్ మండలం అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, డి సి సి బి డైరెక్టర్ ఇంటురి శేఖర్,జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా, కుసుమంచి ఎంపీపీ బి శ్రీనివాస్, నేలకొండపల్లి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శాఖమూరి సతీష్, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు గండు సతీష్,మన్నేపల్లి రమేష్, బోల్లి కొండ వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు..