ఆకట్టుకున్న కళా జాత

Published: Monday September 20, 2021
మధిర, సెప్టెంబర్ 19, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో దెందుకూరు పిహెచ్సి డాక్టర్ పర్యవేక్షణలో నలగాటి సుధాకర్ రావు తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం దెందుకూరు ఎస్సీ కాలనీ లో డెంగ్యూ, చికెన్ గున్యా పై అవగాహన కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కళాకారులు చక్కటి కళాజాత ద్వారా వివరించారు. పాటలు, మిమిక్రీ, మ్యాజిక్ ద్వారా అవగాహన కల్పించారు. జ్వరం వస్తే నిర్లక్ష్యంగా ఉండకూడదని దగ్గరలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలని వారు సూచించారు. ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని టైర్లు, కొబ్బరి బోండాలు, పాత గాబులు మొదలగు వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వారు కోరారు ఈ కళాజాత కార్యక్రమంలో టీమ్ లీడర్ N. సుధాకర్ రావు కాలువ కట్ట జాన్, కోండ్రు హుస్సేన్ రాయబారపు రవి, గోవింద గురవయ్య, మాచర్ల కృష్ణ, కట్ల అపూర్వ ,హెల్త్ సూపర్వైజర్ లంకా కొండయ్య, గ్రామ సర్పంచ్ కోట విజయశాంతి గారు పాల్గొన్నారు.