తెలంగాణ సర్కారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం అభినందనీయం,: టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్ష

Published: Monday April 26, 2021

జిన్నారం, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రంలో ప్రాణవాయువు కొరత ఏర్పడకుండా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని టీఆర్ఎస్ జిల్లా యవత అధ్యక్షులు వేంకటేశం గౌడ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వయసుతో సంబంధం లేకుండా ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పట్ల టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షులు వేంకటేశం గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు నాలుగు కోట్ల మందికి రూ.2,500 కోట్ల ఖర్చుతో వ్యాక్సినేషన్‌ చేపడతామని సీఎం కేసీఆర్‌ వెల్లడించడం సంతోషకరం ఆయన తెలిపారు, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యంకాదని, అందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ ముందడుగు వేశారని ఆయన అన్నారు.