ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Friday April 16, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15 ప్రజా పాలన : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు లబ్ధిదారులకు మంజూరైన  2,89,000 రూపాయలు విలువ గల 8 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని వైద్య చికిత్సలను చేయించుకున్న వారి ఇక్కట్లను తొలగించడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తోందని అన్నారు. ఈ ఆర్ధిక సహాయం ద్వారా పేద ప్రజల ఇబ్బందులు దూరం అవుతాయని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా అమలు చేస్తోందని వివరించారు.
ఇరిగేషన్ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం : 
మన రాష్ట్రంలో వ్యవసాయం మొదటి ప్రాధాన్యత అని గుర్తు చేశారు. పంట సాగు కోసం నీటి విడుదలకు ఉపయోగపడే చెరువులను, కుంటలను నిరంతరం  పర్యవేక్షించాలన్నారు. సాగు కోసం నీరు విడుదల సమయంలో డిస్ట్రిబ్యూటరీ కెనాల్ లో ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే సరి చేయాలని అధికారులనను అదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్ కుమార్, మాజీ జెడ్పీటీసీ ముత్తహర్ షరీఫ్, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, నవీన్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు ఆఫ్జల్ పాష (షకీల్), నాయకులు కాషయ్య, రాజ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, గిరీష్ కొఠారి, ముర్తుజ అలీ, ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఈఈ లు రవికుమార్, భాస్కర్ గౌడ్, ఏఈ లు పివి ఆదిత్య, నవీన్, వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.