మావోయిస్ట్ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా పోలీసుల ప్రత్యేక తనిఖీలు

Published: Thursday September 22, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి: 
 
ఈ నెల 21 నుండి 28 వరకు జరిగే మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల  సందర్భంగా మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్,  జైపూర్ ఏసీపీ నరేందర్  ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, సీఐ విద్య సాగర్, ఎస్ఐ వెంకట్,లు ఒక ప్రకటనలో తెలిపారు.
 మండలంలోని మల్లంపేట్, నక్కల పల్లి వరకు వున్న అడవి మార్గంలో  కల్వర్టులను, తనిఖీలు చేస్తున్నామని,  అడవి ప్రాంతం లో స్పెషల్ పార్టీ, సిబ్బంది, స్థానిక పోలీస్ లతో  అటవీ ప్రాంతంలోని  నీటి సదుపాయాలు ఉన్న ప్రదేశాలను చెక్ చేసి, అడవిలో  కనిపించిన వారిని తనిఖీ చేస్తూ వారి వివరాలు తెలుసుకొని పంపిస్తున్నామని,
  వాహనదారులను సైతం  ఆపి వారి వాహనాలు తనిఖీ నిర్వహించి వివరాలు తెలుసు కోని పంపిస్తున్నామని తెలిపారు.
  ప్రజలు, యువతీ, యువకులు మావోయిస్టు,తీవ్రవాద కార్యకలాపాలకు సహకరించి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మావోయిస్టుల వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆకస్మిక వాహన తనిఖీలు, ఏరియా డామినేషన్స్, ఫెర్రీ పాయింట్స్ చెకింగ్స్, కల్వర్ట్ చెకింగ్, ఆర్ఓపిలు, నిర్వహిస్తున్నామని,  మావోయిస్టు దళ సభ్యులు, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని లేదా డయల్ 100 కీ కాల్ చేసి తెలియజేయాలని కోరారు. తెలిపిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని, వారికి తగిన బహుమతి కూడా ఇవ్వబడుతుందని తెలిపారు.
 
 
 
Attachments area