20 ఏళ్ల టిఆర్ఎస్ కు మద్దతు... ఏడేళ్ల పాలన సీఎం కేసీఆర్ కు సత్తా చాటుదాం..

Published: Thursday October 28, 2021
బాలాపూర్, అక్టోబర్ 27, ప్రజాపాలన (ప్రతినిధి) : మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ కదం తొక్కుతూ కదిలి రండి విజయ్ గర్జన లో గార్జిద్దాం.. అని పిలుపునిచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నవంబర్15న వరంగల్లో జరుగనున్న విజయ్ గర్జన  బహిరంగ సభ విజయవంతం కోసం బుధవారం బడంగ్ పేట కార్పొరేషన్ పరిధిలోని పెద్ద బావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన మహేశ్వరం నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం కార్పొరేషన్ రామిడి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జిల్లా చైర్పర్సన్, పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. సభ ప్రాంగణంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ శాంతి కొరకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.... తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేసుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ కి మద్దతు తెలపాలని అన్నారు. అవకాశవాద పార్టీ లకు  బుద్ధి చెప్పాలన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్, ధరలు పెంచిన బిజెపికి రేపు జరిగే హుజురాబాద్ 30వ తారీఖున ప్రజలు బుద్ధి చెప్పాలని, టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థల ను అమ్ముకుంటూ పోతూ లక్షలాది మందినీ ప్రభుత్వ ఉద్యోగాలను రోడ్డున పడవేస్తున్న బిజెపికి ఉప ఎన్నికల్లోనూ పరాభవం తప్పదు అన్నారు. వరంగల్ విజయ గర్జనకు ప్రతి గ్రామం ప్రతి డివిజన్ నుండి ఒక బస్సు డివిజన్ పెరు, మహేశ్వరం నియోజకవర్గము అని ప్రతి బస్ పై స్టిక్కర్ లు ఉండాలి అన్నారు. అమ్మాకానికి మారు పేరు అయిన బీజేపీ కి తగిన బుద్ధి చెప్తూ, నమ్మకానికి మారు పేరు అయిన తెలంగాణ రాష్ట్ర సమితి కి పట్టం కట్టలన్నారు. నవంబర్ 15న 8 గంటల వరకు ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్ లో పార్టీ జెండా ఎగురవేసి, 8:30 గంటల వరకు మండల కేంద్రానికి, కార్పొరేషన్లలో ముఖ్య కేంద్రాలకు చేరుకోవాలినీ చెప్పారు. 11 గంటల వరకు భ్రమరాంబ ఫంక్షన్ హాల్ కు చేరుకొని భోజన చేసి, అక్కడనుండి వరంగల్ లో విజయ గర్జన సభకు బయలుదేరుదామని అన్నారు. ప్రతి బస్ లో 50 మంది టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలే వచ్చేలాచూసే బాధ్యత వివిధ విభాగాల అధ్యక్షుల బాధ్యత తీసుకోవాలని చెప్పారు. కార్లలో వద్దు అందరం బస్ లలోనే వెలుదాం మంత్రి కూడా బస్ లోనే ఇస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ కారులను గౌరవించాలని, తన కంటే ముందు వారిని వేదిక పై పిలివాలి అన్నారు. పార్టీ ప్లీనరీ విహాయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు... అదే స్ఫూర్తితో విజయ గర్జనను దిగ్విజయం చేయాలని విద్యా శాఖ మంత్రి  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి,రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, మాజి ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి, మీర్పేట్ కార్పొరేషన్ మేయర్లు దుర్గా దీప్ లాల్ చౌహన్, బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహ్మ రెడ్డి, యువ నేత పి. కౌశిక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీ లు, మార్కెట్ చైర్ పర్సన్ వరలక్ష్మి, సహకార సొసైటీ చైర్మన్లు, కార్పొరేషన్ల పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి, కామేష్ రెడ్డి, డివిజన్ ల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలు జిల్లెల కృష్ణారెడ్డి, బేర బాలకిషన్, యువజన విభాగం అధ్యక్షులు కొండల్ రెడ్డి, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గాలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు, సొసైటీ డైరెక్టర్లు, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.