ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు*

Published: Saturday December 10, 2022
మంచిర్యాల టౌన్, డిసెంబర్ 09, ప్రజాపాలన: ఎఐసిసి జాతీయ నాయకురాలు , మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు మంచిరాల లో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం  ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాస గృహంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు మజీద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేసిందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను సోనియాగాంధీ నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని వారు కొనియాడారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఇప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేదికాదని వారన్నారు. సోనియా గాంధీ సారథ్యంలో రాహుల్ గాంధీ  నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా తయారవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ  ప్రధాన కార్యదర్శి జంగంపల్లి బాబన్న, పట్టణ ఉపాధ్యక్షుడు జోగుల సదానందం,తదితరులు పాల్గొన్నారు.