వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి : ప్రత్యేక అధికారిణి అనిత

Published: Thursday December 09, 2021
వికారాబాద్ బ్యూరో 08 డిసెంబర్ ప్రజాపాలన : మర్పల్లి మండల పరిధిలో వంద శాతం శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రత్యేక అధికారిణి అనిత తెలిపారు. బుధవారం మర్పల్లి మండల పరిషత్ అధికారి వెంకట్ రాంగౌడ్ ఆధ్వర్యంలో మండల  కేంద్రంలోని ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు గ్రామాలలో తిరిగి దగ్గర ఉండి వ్యాక్సినేషన్ వేయించాలని సూచించారు. డోర్ టు డోర్ సర్వే చేస్తూ మోటివేషన్ చేస్తూ మొదటి డోస్ రెండవ డోస్ వేయించారు. 6 టీంలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. స్పెషల్ ఆఫీసర్, తులసి రామ్,  వెంకట చారి డిప్యూటి తహసీల్దార్  ఏఈ పీఆర్ శ్రవణ్ కుమార్, ఎంపిఓ సోమలింగం గ్రామాలు విజిట్ చేయనున్నారు. నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తిచేయాలని కలెక్టర్  ఆదేశానుసారం 10వ తారీకు శుక్రవారం వరకు గడువు ఇచ్చారని గుర్తు చేశారు. రెగ్యులర్ గా పనిచేసిన మస్టరులు ఉన్నచో అవి కూడా అందజేయాలని లేనియెడల చర్యలు తీసుకోబడునని ఎంపీడీఓ వెంకట్ రాం గౌడ్ హెచ్చరించారు.