ఇద్దరు ఉపాధ్యాయుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ

Published: Tuesday January 11, 2022
ఉపాధ్యాయుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి అన్నారు. ఆమె మాట్లాడుతూ మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళా ఉపాధ్యాయురాల్లు గుండెపోటుతో మరణించడం చాలా విచారకరమని అన్నారు. నిజామాబాద్ జిల్లా బాబాపూర్ ప్రాంత ఉపాధ్యాయురాలు సరస్వతి బదిలీ కారణంగా గుండె పోటు తో అకాలమరణం పొందడం చాలా విచారకరమని అన్నారు రాష్ట్రపతి ఉత్తర్వులు 317 జీవోను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ తరపున డిమాండ్ చేశారు.  నీళ్లు నిధులు నియామకాల పేరుతో  కాలయాపన చేస్తూ ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ  రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఉద్యోగ నియామకాలు చేయకపోగా ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని ఈ సందర్భంగా పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని జిల్లాల పేరుతో విభజించి ఉద్యోగు ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాలకు పంపిస్తూ చెలగాటం ఆడుతూ వారి కుటుంబాలలో నిప్పులు పోస్తున్నారని వాపోయారు. భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయినట్లైతే వారికి ఒకే ప్రాంతంలో పని చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. అలాంటి నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సంకేతం పంపించారు.