జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం

Published: Friday June 11, 2021

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపాలన ప్రతినిధి ఆర్యవైశ్య మహసభ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అద్యక్షులు, ప్రముఖ సామాజికవేత్త, కరోనా సమయంలో కూడా ఆహార్నిశలు పేదవారికి కరోనాతో ఇబ్బంది పడుతున్న అభాగ్యులకు వివిద సంస్థల ద్వారా నిత్యవసర సరకులతో పాటు ఆర్దిక సహయం చేస్తున్నటువంటి మా అన్న ఇరుకుల రామకృష్ణ గారి జన్మదినం సందర్భంగా వంగపల్లి లోని అమ్మవడి అనాధ ఆశ్రమంలో రాయగిరిలో సహృదయ ఆశ్రమంలో మరియు టేకుల సోమారంలోని సాధన మానసిక వికలాంగుల ఆశ్రమంలో యదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య మహసభ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు మల్లగారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బెజుగం సంతోష్ కుమార్, కోశాధికారి జగిని మధు సుధన్, కార్యనిర్వాహక కార్యదర్శి చీకటిమల్ల వెంకటేశ్వర్లు, బచ్చు శ్రీనివాస్, ఎలుగల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.